ఖమ్మం మెడికల్ కాలేజీ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. కాగా, ఈ నెల 13న ఫస్ట్ ఇయర్ విద్యార్థి చైనీస్ హెయిర్ కటింగ్ చేసుకోవడంతో అసిస్టెంట్ ఫ్రొఫెసర్, యాంటీ ర్యాగింగ్ లెక్చరర్ విద్యార్థికి గుండు కొట్టించిన విషయం తెలిసిందే.