అశ్వరావుపేట మండలంలోని తిరుమలకుంట కాలనీ మడివి కామరాజు వెంకప్ప కు చెందిన ఇల్లు గుట్టపై నుండి వచ్చే ఊటకు నానిపోయి మంగళవారం ఇల్లు కుప్ప కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇల్లు పూర్తిగా కూలిపోయి నిరాశ్యులయ్యామని, సామాగ్రి మొత్తం ఇంటిలోనే ఉండిపోయిందని, కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు.