మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఉపాధి హామీ అధికారులను, సిబ్బందిని బుధవారం ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పనులు కల్పించేందుకు ఎక్కువ అవకాశం గల పనులు పై దృష్టి సారించాలని, ఉపాధి కూలీలకు వంద రోజుల పని దినాలు పూర్తి చేయాలన్నారు.