భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయక పురం గ్రామంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. వేల్పుల రూపా అనే మహిళ(26) బట్టలు ఆరేస్తుండగా కరెంటు తీగకు తగిలి షాక్కు గురైంది. బంధువులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలుకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.