అశ్వారావుపేట పరిసరాల్లో చిరుతపులి సంచరించిందన్న కలకలం రేపింది. పట్టణానికి చెందిన జూపల్లి వెంకట రామారావు బుధవారం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలోని పేటమాలపల్లిలో ఉన్న తన కొబ్బరితోటలోకి వెళ్లగా అక్కడ చిరుతపులి కనిపించిందంటూ పలువురికి తెలిపారు. దీనిపై అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రేంజర్ మురళీకృష్ణ తన సిబ్బందితో కొబ్బ రితోటలో, సమీపంలోని ఆయిల్పాం తోటల్లో పరిశీలించారు.