కలుపుమందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దమ్మపేట పట్వారిగూడెం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కె. సత్యనారాయణ(48) మంగళవారం సాయంత్రం కలుపుమందు తాగాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతికి గల కారణాలు తెలియరాలేదు.