ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక బృందాలకు మంజూరైన యూనిట్లను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం ప్రారంభించారు. ములకలపల్లి మండలం జగన్నాధపురం, నరసాపురం, పూసుగూడెం గ్రామాల్లో మంజూరైన పుట్టగొడుగుల పెంపకం, టైలరింగ్ యూనిట్లను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ములకలపల్లి స్వయం సహాయక బృందాలకు 25 కోట్లు కేటాయించారని ఎమ్మెల్యే అన్నారు.