ములకలపల్లి: రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్

2037చూసినవారు
ములకలపల్లి: రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఐ రాజశేఖర్ కథనం మేరకు.. ములకలపల్లి మండలంలోని సీతారాంపురం శివారు వాగు నుంచి ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందగా శుక్రవారం దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఇసుక తోలుతున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్