దమ్మపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ
దమ్మపేట మండలంలోని నాచారం, గుండుగులపల్లి, దమ్మపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు.