ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని ఆత్కూరు గ్రామంలో తునిగపాడు రోడ్డు కు చెందిన మెనుగు నాగయ్య అనే వ్యక్తి ఇంట్లో గురువారం పట్టపగలు దొంగలు పడి నగదు 1,50,000 రూపాయలు దొంగిలించడం జరిగింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మధిర రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.