సమాజంలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి నేపథ్యంలో ప్రజల దాన, మాన, ప్రాణాల రక్షణే ధ్యేయంగా ఏర్పాటైన డయల్-100కు గత నెలలో 4, 119 కాల్స్ వచ్చినట్లు ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. వాటిపై 91 ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వీటిలో మహిళలపై వేధింపులు-3, దొంగతనాలు-15, సాధారణ ఘాతాలు-33, అనుమానస్పద మరణాలు-4, ఇతర కేసులు-25 అన్నారు. డయల్-100కు ఫేక్ కాల్స్ చేయొద్దని, అత్యవసర సమయంలో మాత్రమే ఫోన్ చేయాలని పేర్కొన్నారు