కారులో తరలిస్తున్న 88 కేజీల గంజాయిని బుధవారం రఘునాథపాలెం మండలంలోని వీవీ పాలెం వద్ద స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ఆకాష్ మహదేవ్ పవర్, రాహుల్ ఇంగిలే, నారాయణ శాంతారాం చౌదరి ఏపీ రాష్ట్రంలోని అనకాపల్లి నుంచి అదే రాష్ట్రానికి చెందిన షేక్ ఆస్ఫక్, ఒడిశాకు చెందిన చైనా సహకారంతో గంజాయిని రవాణా చేస్తున్నారు. వీవీపాలెం వద్ద చేపట్టిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు.