ఖమ్మంలోని వీడీవోస్ కాలనీలో బంధువుల ఇంటికి వచ్చిన ఓ మహిళ మెడలో గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. పాల్వంచకు చెందిన రాజ్యలక్ష్మి ఇటీవల తన బంధువుల ఇంటికి వచ్చింది. శుక్రవారం రాత్రి ఆమె పనిపై బయటకు వెళ్లి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై చేరుకుని ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కుని పోయారు. బాధితురాలు ఖమ్మం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేస్తున్నారు.