చింతగుర్తిలో ఘనంగా పుష్పార్చన

59చూసినవారు
చింతగుర్తిలో ఘనంగా పుష్పార్చన
ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం ఘనంగా పుష్పార్చన జరిగింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారికి అభిషేకం, అష్టోత్తర శతనామార్చన, నీరాజన మంత్రపుష్పములు జరిపిన తరువాత ఉత్తర ద్వారదర్శనం జరిగింది. తదనంతరం గ్రామస్థులందరూ రకరకాల పూలను తెచ్చి ఆలయ అర్చకులతో పుష్పార్చన జరిపించారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్