ఖమ్మం మున్నేరుకు వరద మళ్ళీ పెరుగుతుంది. కాల్వఒడ్డు వద్ద ఉన్న మున్నేరు వాగు నీటిమట్టం ఉదయానికి 10 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 13 అడుగులకు చేరింది. క్రమంగా 3 అడుగుల మేర పెరిగింది. వరద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో నగర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరద ఉధృతికి సర్వం కోల్పోయామని, మళ్ళీ ముంపు ప్రాంతాలకు వరద చేరితే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.