ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తికి అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ ను ఆయన స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్లో అందుకున్నారు. 1995 ఎస్ఐ బ్యాచ్ కు చెందిన రమణమూర్తి ఏసీబీ డీఎస్పీగా పనిచేసినప్పుడు అందించిన సేవలకు గాను మెడల్ ప్రకటించారు. ఈ మేరకు ఆయనను సీపీ సునీల్ దత్ తో పాటు అధికారులు, సిబ్బంది అభినందించారు.