బీజేపీని గ్రామగ్రామాన విస్తరించేలా కార్యాచరణ రూపొందించాలని పార్టీ నాయకుడు పేరాల శేఖర్ సూచించారు. ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నమోడీ నేతృత్వాన జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో విఫలమైన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. రైతుభరోసా, మహిళలకు ఆర్థిక సాయం తదితర హామీలను విస్మరించిన విషయాన్ని వివరిస్తూ పార్టీ బలోపేతానికి పాటుపడాలని చెప్పారు.