ఖమ్మం పట్టణం జలగం నగర్లో పారిశుధ్య పనులను బుధవారం అదనపు కలెక్టర్ మధుసూధన్ నాయక్ పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు శరవేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రజలు ఎలాంటి అనారోగ్యంకు గురికాకుండా వైద్యాధికారులు ముందస్తు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విధుల్లో బ్లీచింగ్ పౌడర్, పిచికారి చేయాలని సిబ్బందికి ఆదేశించారు.