కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కార్మికుల ఆందోళన

68చూసినవారు
మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆలిండియా డిమాండ్స్ డేలో భాగంగా బుధవారం ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ముందు కార్మికులతో కలిసి ఆందోళన నిర్వహించారు. కార్పొరేషన్ లో అక్రమ ప్రమోషన్లు నిలుపుదల చేయాలని, కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వాలని, కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్