రెవెన్యూ సంబంధిత సమస్యలన్నీ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్లో బుధవారం ఆయన రెవెన్యూ అధికారులతో ధరణి, ప్రజావాణి, ధృవీకరణలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర అంశాలపై సమీక్షించారు. మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని. ఇందుకోసం ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. తద్వారా తహసీల్లో స్పందించ లేదనే మాట రాకుండా చూసుకోవాలన్నారు.