రక్తదానం చేసి మహిళ ప్రాణాన్ని కాపాడిన ఎన్.ఎస్.ఎస్ విద్యార్థి

968చూసినవారు
రక్తదానం చేసి మహిళ ప్రాణాన్ని కాపాడిన ఎన్.ఎస్.ఎస్ విద్యార్థి
ఖమ్మం నగరంలోని ప్రయివేట్ ఆస్పత్రిలో రక్త హీనతతో బాధ పడుతున్న మహిళకు అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం ఎక్కించాల్సిందిగా సూచించారు. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ యూత్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు లింగనబోయిన సతీష్ ద్వారా విషయం తెలుసుకున్న గీతాంజలి డిగ్రీ కళాశాల విద్యార్థి బాణోత్ మోహన్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ రక్తదానం చేయడం సంతోషంగా ఉందని తెలియచేశాడు వీరితో పాటు కళాశాల ఎన్. ఎస్. ఎస్ పిఓ ఉమాశంకర్ విద్యార్థి శ్రీను తదితరులు ఉన్నారు. కళాశాల డైరెక్టర్ నెల్లూరి హనుమంతరావు, ప్రిన్సిపాల్ తిరుమలరెడ్డి అభినందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్