ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా పటిష్ట పర్యవేక్షణకు నియోజకవర్గ స్థాయి ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఇంచార్జ్ కలెక్టర్ డా. పి. శ్రీజ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఖమ్మం నియోజకవర్గానికి జెడ్పి సిఇఓ దీక్షా రైనా, పాలేరు కు ఎస్డీసి ఎం. రాజేశ్వరి, మధిర కు జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, వైరా కు డివిజనల్ పంచాయతీ అధికారి టి. రాంబాబు, సత్తుపల్లి నియోజకవర్గానికి ఎల్. రాజేంద్ర గౌడ్ లు ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు.