
వలసదారులకు ట్రంప్ స్పెషల్ ఆఫర్
ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేసినా సంచలనమే. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వలసదారులపై కన్నెర్ర చేసారు. ఇప్పటికే వలసదారుల్ని కట్టడి చేశారు. అయితే అమెరికాలోని వలసదారులకు మాత్రం ఓ స్పెషల్ ఆఫర్ని ప్రకటించారు. స్వీయ బహిష్కరణ చేసుకునే వారికి విమాన ఖర్చులతో పాటు కొంత డబ్బును ఇస్తామని ఓ ఇంటర్వూలో తెలిపారు. చట్టపరంగా అన్నీ సక్రమంగా ఉంటే వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు.