స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఆర్టీసీ ఖమ్మం రీజియన్ కార్యాలయంలో ఆర్ఎం సరీరామ్ నాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు. రీజియన్ లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన డ్రైవర్స్, కండక్టర్లను ప్రశంసించారు. మొత్తం 115 ఆర్టీసి సిబ్బందికి అవార్డులను అందజేశారు. రీజియన్ లెవెల్లో ఆర్ఎం చేతుల మీదుగా 15 మంది అవార్డులు అందుకోగా, మిగతా 100 మంది డిపో పరిధిలో స్థానిక డీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.