సింగరేణి మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ నందు గురువారం అమ్మ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది. డాక్టర్ భగత్ సింగ్ ను శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఇమ్మడి తిరుపతిరావు మాట్లాడుతూ సింగరేణి మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. నాణ్యమైన మెడిసిన్స్ వాడుతూ వైద్యం అందించాలని అమ్మ ఆస్పటల్ యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.