ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీకి త్వరలోనే దేశ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వేజండ్ల సాయికుమార్ అన్నారు. బీహార్ లో దళిత విద్యార్థులను కలిసేందుకు వెళ్లిన రాహుల్ గాంధీని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శనివారం ఖమ్మంలో యువజన కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించి బీహార్ సీఎం నితీష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ పై బీజేపీ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.