దీక్ష దివస్ సందర్భంగా ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మమతా కాలేజీ గ్రౌండ్ నుంచి తెలంగాణ తల్లి సర్కిల్ వరకు జరిగింది. ఈ ర్యాలీలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ దీక్షను గుర్తు చేస్తూ ర్యాలీలో జై తెలంగాణ నినాదాలు చేశారు.