ఖమ్మం నగరంలోని పలు శివాలయాలలో శుక్రవారం ఆమ్మవారికి పరమేశ్వరునికి కుంకుమపూజలు, సహస్ర నామార్చనలతో బిల్వార్చనలు జరిగాయి. కార్తీకమాసం చివరి రోజులలో శుక్రవారం మాసశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచే పరమేశ్వరునికి అభిషేకాలు, అమ్మవారికి లలితా సహస్రనామార్చనతో కుంకుమపూజలు జరిగాయి.