వరద బాధితులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుంది: వినోద్ రావు

56చూసినవారు
వరద బాధితులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుంది: వినోద్ రావు
మున్నేరు వరద బాధితులకు బీజేపీ పార్టీ తమ వంతు సహాయంగా ముంపు ప్రాంతాలలో భోజనం, దుస్తులు పంపిణీ చేశామని పార్లమెంట్ ఇంఛార్జి వినోద్ రావు తెలిపారు. గురువారం ఖమ్మం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. మున్నేరు ఉపద్రవంతో గత 100 సంవత్సరాలలో లేనంతగా నష్టం వాటిల్లిందన్నారు. రాజీవ్ గృహకల్ప, మోతీనగర్ తదితర ప్రాంతాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్