ప్రపంచ రక్తదాన దినోత్సవం, బోస్ యాదవ్ జన్మదిన సందర్భంగా ఖమ్మం నగరంలోని విదుర బ్లడ్ బ్యాంకులో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీ ఆర్ విత్ యూ ఆర్గనైజేషన్ ఫౌండర్ పేరం బోస్ యాదవ్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యాన ప్రతీ ఏడాది రక్తదానం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సుమారు 100 మంది పైగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ బాధ్యులు తదితరులు ఉన్నారు.