రఘునాథపాలెం మండలంలోని వీఆర్. బంజర్లో శనివారం తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన నువ్వుల రమేష్ ఇంటికి తాళం వేసి
ఆస్ట్రేలియాలో ఉన్న కుమార్తె వద్దకు నెల క్రితం వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు శనివారం తాళం పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు సమీప బంధువులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ శ్రీహరి పరిశీలించి యజమానుల ద్వారా ఫోన్లో వివరాలు సేకరించారు.