ప్రశాంతంగా హెచ్ డబ్ల్యూఓ పరీక్షలు

64చూసినవారు
ప్రశాంతంగా హెచ్ డబ్ల్యూఓ పరీక్షలు
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల ఎంపికకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న పరీక్షలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని ఎనిమిది కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన పరీక్షకు ఉదయం 1, 610మందికి గాను 1, 014మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1, 610మంది అభ్యర్థులకు గాను 1, 028మంది హాజరయ్యారు. ఎలాంటి అంతరాయాలు లేకుండా పరీక్షలు కొనసాగాయని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :