11 అడుగుల కొండచిలువ పట్టివేత

80చూసినవారు
రఘునాథపాలెం మండలం వేపకుంట్లలోని ఓ ఇంట్లోకి 11 అడుగుల పొడవైన కొండచిలువ చొరబడింది. గ్రామానికి చెందిన సుర వీరయ్య ఇంట్లోకి కొండచిలువ వెళ్తుండగా గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో బీట్ అధికారి కన్నయ్య ఆధ్వర్యాన గోపి, తదితరులు కొండచిలువను బంధించి సమీపంలోని అడవిలో వదిలిపెట్టారు.

సంబంధిత పోస్ట్