నేడు 'ప్రపంచ వృద్ధుల దినోత్సవం'
ప్రపంచ వృద్ధుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న నిర్వహించబడుతుంది. పెద్దల పట్ల నేటితరం చూపిస్తున్న వ్యవహారశైలిని పరిగణనలోకి తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యను చర్చించి వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. మొదటిసారిగా 1991, అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు.