వరద బాధితులకు సహాయం చేయటానికి ముందుకు రావాలి

84చూసినవారు
వరద బాధితులకు సహాయం చేయటానికి ముందుకు రావాలి
ప్రకృతి వైపరీత్యాల కారణంగా వచ్చిన వరదలలో ముంపుకు గురై నిరాశ్రయులైన బాధితులను ఆదుకోవటానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ పిలుపునిచ్చారు. ఖమ్మం దంసలాపురం కాలనీలో మున్నేరు వరద బాధితులకు సిపిఐ నాయకుల సహకారంతో 200 దుప్పట్లను ఆయన పంపిణీ చేశారు. ప్రకృతి వైపరీత్యాలకు గురైనప్పుడు సాటి ప్రజలను ఆదుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్