ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఇంటింటి సర్వే ప్రక్రియను ఎన్నికల సంఘం నుంచి డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి పరిశీలిస్తున్నారు. కాగా, జిల్లాలోని 21 మండలాల్లో 12, 25, 422 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 8, 83, 920 మంది ఓటర్ల సర్వే చేశామని, మిగితాది త్వరలో పూర్తి చేస్తామని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు.