సీతారామ ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయండి

62చూసినవారు
సీతారామ ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయండి
ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ప్రాజెక్టు స్టేజ్- 2 పనుల పురోగతిపై మంగళవారం ఆయన అధికారులతో సమీక్షించారు. సీతారామ ప్రాజెక్ట్, ఎన్నెస్పీ లింక్ కెనాల్ పనులు పురోగతిలో ఉన్నందున ఇంకా కావాల్సిన భూమి త్వరగా సేకరించాలని తెలిపారు. 75 శాతం కంటే ఎక్కువ భూమి కోల్పోయి కొద్దిమేర మాత్రమే మిగిలితే అది కూడా తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్