ఖమ్మంలోని 26వ డివిజన్లో గత 15 రోజులుగా మున్సిపాలిటీ కుళాయిలో నీళ్లు రాకపోవడంతో శనివారం నిరసన తెలియజేస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికారప్రతినిధి మార్తి వీరభద్రప్రసాద్ మాట్లాడుతూ ఇళ్ల ముందున్న బోర్డులను తీసేయడం వల్ల నీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని, వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు మంద సరస్వతి, స్థానిక మహిళలు ఉన్నారు.