ముదిగొండ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నేలమర్రి ఉపేందర్ పోలీస్ మీట్ ఆఫ్ స్టేట్ లెవెల్ హ్యాండ్ బాల్ విభాగంలో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు కరీంనగర్లో జరిగిన పోటీల్లో ప్రతిభకనబరిచాడు. ఈ మేరకు ఉపేందర్ ను సీపీ సునీల్ దత్ సోమవారం ఖమ్మంలోని తన కార్యాలయంలో అభినందించారు. అలాగే ముదిగొండ సీఐ మురళి, పోలీస్ సిబ్బంది పలువురు శుభాకాంక్షలు తెలిపారు.