ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో పంటలు ఎండి పోతున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ శుక్రవారం ఆరోపించారు. సాగునీటిని వదిలి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, నాయకులు ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంప్ లో నీటి పారుదలశాఖ ఎస్ఈ కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. కార్యాలయంలోకి చొచ్చుకొని పోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.