టీజీఎస్ ఆర్టీసీ కండక్టర్లకు 2013 వేతన సవరణకు సంబంధించిన బాండ్ల బకాయిలను యాజమాన్యం చెల్లించడంపై టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐటీయూసీ)ఉప ప్రధాన కార్యదర్శి పాటి అప్పారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఖమ్మంలో అయన మాట్లాడుతూ.. ఇంకా మెకానిక్ లు, సెక్యూరిటీ సిబ్బంది, సూపర్ వైజర్లు, ఆఫీస్ సిబ్బందికి కూడా వినాయక చవితిలోగా డబ్బులు అందించాలని కోరారు.