ఖమ్మంలోని భక్త రామదాసు కళా క్షేత్రంలో స్వామి వివేకానంద జయంతోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 950 మంది యువతీ, యువకులు పాల్గొన్నారు. జానపద నృత్యంలో 60 గ్రూప్లు, జానపద గేయాలకు 30 గ్రూప్లు, సైన్స్ మేళాకు పది గ్రూప్లు పాల్గొనగా. వక్తృత్వ పోటీలకు 40 మంది, వ్యాసరచన పోటీలకు 50 మంది యువత హాజరయ్యారు. ఈ మేరకు పోటీలను డీవైఎస్ఓ, డీఐఈఓ, డీఈఓ ప్రారంభించారు.