ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాల కురుస్తున్నందున వాగులు, వంకలు, చెరువుల ప్రవాహాన్ని చూసేందుకు ప్రజలెవరు బయటకు రావొద్దని సీపీ సునీల్ దత్ విజ్ఞప్తి చేశారు. ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద వస్తుండగా చూసేందుకు ప్రజలు భారీగా వెళ్తున్నారని తెలిపారు. అయితే, సెల్ఫీలు దిగే ప్రయత్నంలో ప్రమాదం బారిన పడే అవకాశమున్నందున ప్రజలు ఎవరూ వెళ్లొద్దని సీపీ ఓ ప్రకటనలో సూచించారు.