భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కార్మికులకు దసరా కానుక అందించాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారగోని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఖమ్మంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మటూరు రామకృష్ణ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక తిరోగమన విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.