మనీ లాండరింగ్ కేసులో ఖమ్మం బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుకు షాక్ తగిలింది. ఆయనకు సంబంధించిన కంపెనీ మధుకాన్ ప్రాజెక్ట్స్ పై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. రాంచీ-జంషెడ్ పూర్ మధ్య 4వ లైన్ హైవే నిర్మాణ ప్రాజెక్టు కోసం గతంలో మధుకాన్ కంపెనీ బ్యాంకు నుంచి రూ. 1030 కోట్లు తీసుకుంది. కానీ. ప్రాజెక్టు పనులు మాత్రం మధుకాన్ గ్రూప్ పూర్తి చేయలేకపోయింది. దీంతో మధుకాన్ ప్రాజెక్ట్ పై ఎఫ్ఐఆర్ నమోదయింది.