సీతారామ ప్రాజెక్టు నీటిని భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు అందించాలని శాంతియుత నిరసన చేపట్టిన సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులను అరెస్టు చేయడం సరికాదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్ అన్నారు. శాంతియుత నిరసన చేపట్టిన తమ పార్టీ నాయకులను ఇల్లందు సీఐ దుర్భాషలాడుతూ బలవంతంగా అరెస్టు చేశారని చెప్పారు. ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా ఖమ్మం నగరంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.