నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ బంద్

81చూసినవారు
నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ బంద్
రఘునాథపాలెం పారిశ్రామిక ఫీడర్ 11 కేవీ లైన్ పరిధిలో మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ ఇందిరా తెలిపారు. ఫిడర్ పరిధిలోని కేటీఆర్ కాలనీ, కేసీఆర్ కాలనీ, గ్రీన్ కాలనీ, పువ్వాడనగర్, పాత పోలీస్ స్టేషన్ ఏరియా తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్