ఖమ్మంలో మున్నేరు వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసర సరుకులతో పాటు పాలు, కూరగాయలు, దుప్పట్లు, బెడ్ సిట్లు, చీరలు, టవళ్లు పంపిణీ చేస్తోంది. ఈ సామగ్రితో కూడిన పది వేల కిట్లను ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఖమ్మం బొక్కలగడ్డ ప్రాంతంలో ప్రభుత్వ కిట్లను మేయర్ పునుకొల్లు నీరజ బాధితులకు అందజేశాశారు. డీఆర్డీఓ ఆర్. సన్యాసయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.