ఖమ్మం నగర శివారు గొల్లగూడెంలోని తాలిముల్ ఇస్లాం మదర్సాలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పిఏ సయ్యద్ ఇస్మాయిల్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మదర్సాకు చెందిన విద్యార్థులు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను, జాతీయ నేతల జీవిత చరిత్రను క్లుప్తంగా వివరించారు.