అనారోగ్యంతో ఉన్న మెకానిక్ కు ఆర్థిక సహాయం

75చూసినవారు
అనారోగ్యంతో బాధపడుతున్న టూవీలర్ మెకానిక్ తోట జగదీష్ కు ఆ సంఘం యూనియన్ అండగా నిలిచింది. అతనికి రూ. 21 వేలు ఆర్ధిక సహాయం అందించారు. గత 25 సంవత్సరాలుగా మెకానిక్ గా పనిచేస్తున్న జగదీశ్ కు ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడింది. దీంతో వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటుండగా కుటుంబ పోషణ కోసం ఆర్ధిక సహాయం అందించినట్లు యూనియన్ అధ్యక్షుడు కొండల్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మెకానిక్ సభ్యులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్